చైనాతో పాకిస్థాన్ భారీ డీల్

చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

By Medi Samrat  Published on  24 Dec 2024 6:37 PM IST
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్

చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. J-35A చైనాకు చెందిన అత్యంత అధునాతన సైనిక విమానం కాగా.. వీటిని ఏకంగా 40 కొనాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే చైనా వెలుపల స్టీల్త్ J-35A మల్టీ-రోల్ ఫైటర్ జెట్‌లను కలిగి ఉన్న ఏకైక దేశంగా పాకిస్తాన్ నిలుస్తుంది.

J-35A అనేది చైనా రెండవ ఐదవ తరం స్టీల్త్ ఫైటర్ జెట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత, ప్రపంచంలో రెండు 5వ తరం సైనిక విమానాలను కలిగి ఉన్న ఏకైక దేశం చైనా మాత్రమే. పాకిస్థాన్ ఎఫ్-16లు, ఫ్రెంచ్ మిరాజ్ యుద్ధ విమానాలను కొత్త విమానాలతో భర్తీ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. కేవ‌లం రెండేళ్ల‌లోనే 40 స్టీల్త్ విమానాల‌కు పాకిస్థాన్‌కు చైనా స‌ర‌ఫ‌రా చేసేలా డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది.ఈ జెట్‌ల కొనుగోలుకు పాకిస్థాన్ వైమానిక దళం ఇప్పటికే ఆమోదం తెలిపింది. చైనా నుండి మాత్రం ఈ డీల్ గురించి ఎటువంటి ధృవీకరణ రాలేదు.

Next Story