'ఇది భారత్ పన్నాగం..' పాక్ మళ్లీ అదే పాత రాగం..!

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్‌పై నిందలు వేస్తోంది.

By -  Medi Samrat
Published on : 3 Nov 2025 3:48 PM IST

ఇది భారత్ పన్నాగం.. పాక్ మళ్లీ అదే పాత రాగం..!

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎవరికీ కనిపించడం లేదు. కానీ, ప్రతిసారీలాగే ఈసారి కూడా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు భారత్‌పై నిందలు వేస్తోంది. పాకిస్థాన్‌పై న్యూఢిల్లీ కుట్ర పన్నుతున్నదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఖవాజా ఆసిఫ్ ప్రకారం.. తూర్పు, పశ్చిమ ఫ్రంట్‌లో పాకిస్తాన్‌ను చిక్కులో ఉంచాలని భారత్‌ కోరుకుంటోంది. డ్యూరాండ్ లైన్ (పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు)లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఇందులో భాగమేన‌ని ఆరోపించాడు.

జియో న్యూస్‌తో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. “సాక్ష్యం అవసరమైతే.. పాకిస్తాన్‌లో అస్థిరతను వ్యాప్తి చేయడంలో భారతదేశం హస్తం ఉందని మా వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే, ఖవాజా ఆసిఫ్ తన మాటలు నిజమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సాధించడానికి ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వానికి ఖవాజా ఆసిఫ్ మద్దతు ఇచ్చారు.

ఆఫ్ఘనిస్థాన్ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యమని పాకిస్థాన్ అభిప్రాయపడింది. ఆఫ్ఘన్ గడ్డపై పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ను తప్పుదోవ పట్టించడం ద్వారా భారత్ తాలిబన్లను ఉసిగొల్పిందని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్ రాజధాని)లో కూర్చున్న ప్రజలు న్యూఢిల్లీలోని కీలుబొమ్మల్లా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి చేయ‌గా, దానికి ప్రతిస్పందనగా ఆఫ్ఘన్ సైన్యం కూడా పాకిస్తాన్ సైనికులపై దాడి చేసింది. అక్టోబర్ 9న కాబూల్‌లో జరిగిన పేలుళ్ల తర్వాత హింస చెలరేగింది. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించారు. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌పై దాడికి పాల్పడింది.

Next Story