2000 దాటిన భూకంప మృతులు

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on  8 Oct 2023 9:15 PM IST
2000 దాటిన భూకంప మృతులు

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దశాబ్దాలలో ఆ దేశంలో సంభవించిన ఘోరమైన భూకంపాలలో ఒకటని చెబుతున్నారు. శనివారం పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఈ మరణాలు సంభవించాయని ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది.

హెరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని దేశ సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయాన్ తెలిపారు. ఈ భూకంపం ధాటికి దాదాపు ఆరు గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. తక్షణ సహాయం కోసం ప్రపంచ దేశాలను తాలిబాన్లు కోరారు. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని తర్వాత మూడు సార్లు 6.3, 5.9, 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Next Story