ఆ నర్సుకు 700 సంవత్సరాల జైలు శిక్ష

అనేక మంది రోగులను చంపే ప్రయత్నంలో మూడేళ్లపాటు ఇన్సులిన్ ను మోతాదులకు మించి అందించిన US నర్సుకు 380-760 సంవత్సరాల జైలు శిక్ష విధించారు

By Medi Samrat  Published on  4 May 2024 11:45 AM IST
ఆ నర్సుకు 700 సంవత్సరాల జైలు శిక్ష

అనేక మంది రోగులను చంపే ప్రయత్నంలో మూడేళ్లపాటు ఇన్సులిన్ ను మోతాదులకు మించి అందించిన US నర్సుకు 380-760 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 2020- 2023 మధ్య ఐదు ఆరోగ్య కేంద్రాలలో కనీసం 17 మంది రోగుల మరణాలకు ఆమె కారణమని కోర్టు తెలిపింది. పెన్సిల్వేనియాలోని 41 ఏళ్ల నర్సు హీథర్ ప్రెస్‌డీ మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఆమెకు జీవిత ఖైదు విధించారు.

ప్రెస్‌డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. ఆమె చేతుల్లో మరణించిన వారు 43 నుండి 104 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని తెలుస్తోంది. ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. మీ హృదయ స్పందనను పెంచుతుంది. అంతేకాకుండా గుండెపోటుకు కూడా దారితీస్తుంది.

Next Story