'ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారు.. కానీ..': ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 13 March 2026 11:16 AM IST

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారు.. కానీ..: ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. మోజ్తాబా ఖమేనీ ఇప్పటికీ ఏదో విధంగా బతికే ఉన్నారని ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై జరిగిన దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారని, మోజ్తాబా ఖమేనీ గాయపడ్డారని అమెరికా మీడియా నివేదిక పేర్కొన్న తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉండవచ్చని అమెరికా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మోజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదని నివేదిక పేర్కొంది.

ఫాక్స్ న్యూస్ రేడియోలో బ్రియాన్ కిల్మీడ్ షోతో మాట్లాడుతూ ట్రంప్.. "అతను బహుశా బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అతను గాయపడ్డాడని నేను అనుకుంటున్నాను, కానీ అతను ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొజ్తాబా ఖమేనీ గురించి తన మొదటి వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా వెనక్కి తగ్గదని కూడా ఆయన సూచించారు.

ఇరాన్‌లో ఇటీవల జరిగిన దాడుల తర్వాత మోజ్తాబా ఖమేనీ గురించి వివిధ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ది సన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. 56 ఏళ్ల ఖమేనీ ఈ దాడుల్లో ఒక కాలును కోల్పోయాడని.. ఆయ‌న‌ కడుపు లేదా కాలేయానికి కూడా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొంది.

మోజ్తాబా ఖమేనీ భార్య, ఆయన సోదరి, మేనకోడలు, ఆయన తండ్రి, సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా అమెరికా దాడిలో మరణించారు.

Next Story