జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అగ్ర నాయకుడు చెప్పాడు. ఇటీవలి పరిణామాల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెనక్కి తగ్గారని, ఇమ్రాన్ ఖాన్ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని పాక్ మీడియా చెబుతోంది. ఆగస్టు 2023 నుండి జైలులో ఉన్న మాజీ ప్రధానికి జూన్ 11న బెయిల్ లభించే అవకాశం ఉందని పిటిఐ చీఫ్ గోహర్ అలీ ఖాన్ చెప్పినట్లుగా పిటిఐ నివేదించింది.
ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం తెర వెనుక చర్చలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కు పెరుగుతున్న ప్రజా మద్దతు, తన జైలు గది నుండే దేశవ్యాప్త నిరసనలను ఇమ్రాన్ ఖాన్ ప్లాన్ చేస్తూ ఉండడం, భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ శిక్షలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) జూన్ 11న విచారించనుంది. అందుకే ఆ రోజు పాక్ రాజకీయాల్లో కీలకం కానుంది.