త్వరలోనే భారత దేశంలో పర్యటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026 సదస్సులో ట్రంప్ పంపిన ఈ సందేశాన్ని అమెరికాకు చెందిన లారా లూమర్ ప్రస్తావించారు. తాను వేదికపైకి రావడానికి సుమారు గంట ముందు అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడానని లారా తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ నాకు ఇండియా అంటే చాలా ఇష్టం.. నేను మోదీని ఎంతగానో ఇష్టపడతానని వారికి తెలియజేయండి. ప్రధాని మోదీ ఒక అద్భుతమైన నాయకుడు, నా మంచి స్నేహితుడు. త్వరలోనే మరో పర్యటన కోసం నేను కచ్చితంగా భారత్‌కు వస్తానని భారత ప్రజలకు చెప్పండని ట్రంప్ తనతో అన్నట్లు లూమర్ వెల్లడించారు.
2020లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల మధ్య నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమం భారీ హిట్ అయింది. ఈసారి ఎక్కడ, ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.