చైనాలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం

Earthquake of 6.9 magnitude rocks China. చైనా దేశంలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

By అంజి  Published on  8 Jan 2022 5:01 AM GMT
చైనాలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం

చైనా దేశంలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి.

భూకంపం వచ్చిన ప్రాంతానికి స్థానిక ప్రభుత్వం అధికారులు పంపింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రకంపనలు భారీగా నమోదైనట్లు తెలిసింది. మెన్యువాన్‌ కౌంటీలో రాత్రి భూమి కంపించడంతో.. జంతువులు పరుగులు పెట్టాయి. జంతువులు పరుగులు తీసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి. 4.1, 3.0, 5.1 తీవ్రతతో మూడు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు వెదర్‌ రిపోర్టు అధికారులు చెప్పారు. జినింగ్‌ నగరంతో పాటు ఘాన్సూ, నింగ్జాయి, షాంగ్జీ ప్రావిన్సుల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా భవనాలు కూలిపోయినట్లు తెలియరాలేదు.

Next Story