లష్కరే తోయిబాలో 'చీలిక'.. కార‌ణం భార‌త్ చేప‌ట్టిన ఆ 'ఆప‌రేష‌న్‌'

భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి.

By -  Medi Samrat
Published on : 13 Jan 2026 4:06 PM IST

లష్కరే తోయిబాలో చీలిక.. కార‌ణం భార‌త్ చేప‌ట్టిన ఆ ఆప‌రేష‌న్‌

భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చీలిక ఏర్ప‌డిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ చేప‌ట్టిన‌ ఆపరేషన్ సింధూర్ కార‌ణం అని తెలుస్తుంది.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మాట్లాడుతూ.. లష్కరే తోయిబాలో సమస్యలు మొదలయ్యాయని, ఇటీవలి నెలల్లో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో కొందరు అగ్రనేతలు ఏకీభవించడం లేదని తెలిపారు. సంస్థ తన మౌలిక సదుపాయాలలో ప్రధాన భాగాన్ని కోల్పోగా.. అందుకు ఆపరేషన్ సింధూర్ కార‌ణం అని అధికారి తెలిపారు. అప్ప‌టి నుంచి సంస్థను తిరిగి విలీనం చేయడం కష్టంగా మారుతోంది. ఈ సంస్థతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఐఎస్‌ఐ, పాకిస్తాన్ సైన్యంపై నమ్మకం కోల్పోయారు.. ఎందుకంటే వారు ఇకపై తమను రక్షించలేరు అనే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు మాట్లాడుతూ.. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న వ్యక్తులు.. చైనా, అమెరికాల డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం అతిగా నెరవేరుస్తోందని భావిస్తున్నట్లు చెప్పారు. బలూచిస్థాన్‌లోని ఖనిజాలపై చైనా, అమెరికాల దృష్టి ఉంది.

అయితే.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ (TTP), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెండూ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా (KP) లలో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఈ సంస్థలతో పోరాడ‌లేకపోయింది. కాబట్టి అది ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)ని కలుపుకుని, TTP, BLAతో పోరాడేందుకు లష్కరే తోయిబాతో లింక్ చేయాలని నిర్ణయించుకుంది. పాకిస్థాన్ సైన్యం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి లష్కరే నాయకత్వం చైనా, పాశ్చాత్య దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు సొంత ప్రజలతో పోరాడాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నను లేవనెత్తింది.

Next Story