అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ చైనా పట్ల ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా జో బైడెన్ ఆ దేశ ప్రధాన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తే మనం తినే తిండిని కూడా లాగేసుకుంటుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై తర్వాత తొలిసారి జో బైడెన్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చైనా అధినేతతో ఫోన్ తర్వాత జో బైడెన్ వైట్ హౌస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఇకనైనా మనం ముందడుగు వేయకపోతే చైనా మన ఆహారాన్ని సైతం తీనేస్తుందంటూ వ్యాఖ్యానించారు.
చైనా తమకు వూహాత్మక ప్రత్యర్థి అని పేర్కొన్న బైడెన్.. పసిఫిక్ -ఇండో ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు అంశాలపై జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అనుసరిస్తున్న బలవంతపు, అన్యాయమైన వాణిజ్య పద్దతులు, హాంకాంగ్‌లో అణచివేతలు, గ్జిన్‌జియాంగ్‌లో ముస్లిం వర్గాలపై ఉక్కుపాదం మోపడం, తైవాన్ సహా చిన్న దేశాలపై చైనా దురాక్రమణకు పాల్పడటం వంటి అంశాలపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. చైనాపై బైడెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొంది.