భారత్‌-పాక్‌ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన‌ చైనా.!

భారత్‌-పాక్‌ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది

By Medi Samrat
Published on : 9 May 2025 4:14 PM IST

భారత్‌-పాక్‌ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన‌ చైనా.!

భారత్‌-పాక్‌ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్‌ స్పందించారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని తెలిపారు. భారత్‌-పాక్‌ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ శాంతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు.

ఇక భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.

Next Story