ఊహించని బ్లాస్ట్.. పోలింగ్ కు ముందే ప్రాణాలు తీసేస్తున్నారు

పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  7 Feb 2024 3:30 PM GMT
ఊహించని బ్లాస్ట్.. పోలింగ్ కు ముందే ప్రాణాలు తీసేస్తున్నారు

పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22 మందికి పైగా మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక అస్పత్రికి పోలీసులు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు స్వంతంత్ర అభ్యర్థి ఎన్నికల కార్యాలయం వద్ద జరిగాయి. గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.

మొదటి దాడి పిషిన్ జిల్లాలో చోటు చేసుకుంది. స్వతంత్ర ఎన్నికల అభ్యర్థి కార్యాలయంలో 12 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ పేలుడు జరిగింది. జమియాత్ ఉలేమా ఇస్లాం (JUI) కార్యాలయం సమీపంలో పేలింది. ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇస్లామిస్ట్ మిలిటెంట్ పాకిస్తానీ తాలిబాన్, బలూచిస్తాన్ నుండి వచ్చిన వేర్పాటువాద గ్రూపులతో సహా అనేక గ్రూపులు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలి నెలల్లో దాడులు చేశాయి.

Next Story