భారత్‌ను టార్గెట్ చేయడం తప్పు.. ట్రంప్‌పై విమర్శలు

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో శాంతి స్థాపనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశకు గురైనందుకు అమెరికా భారత్‌పై నిందలు వేయడం మానుకోవాలని అమెరికా వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు ఆష్లే జె. టెల్లిస్ అన్నారు.

By Medi Samrat
Published on : 3 Sept 2025 9:15 PM IST

భారత్‌ను టార్గెట్ చేయడం తప్పు.. ట్రంప్‌పై విమర్శలు

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో శాంతి స్థాపనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశకు గురైనందుకు అమెరికా భారత్‌పై నిందలు వేయడం మానుకోవాలని అమెరికా వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు ఆష్లే జె. టెల్లిస్ అన్నారు. ట్రంప్ శాంతి చొరవలో ఎదురవుతున్న ఇబ్బందులకు భారత్‌పై నిందలు వేయడం మానుకోవాలని ఆయన అన్నారు.

అధ్యక్షుడు పుతిన్ తన అసలు లక్ష్యాలపై దృఢంగా ఉన్నంత కాలం ప్రధాని మోదీ గానీ, అధ్యక్షుడు ట్రంప్ గానీ ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పలేరని ఎన్‌డిటివితో మాట్లాడుతూ ఆష్లే జె.టెల్లిస్ స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న తన స్నేహితులు తనను ఒప్పించినంత మాత్రాన పుతిన్ యుద్ధాన్ని ఆపడని ఆయన అన్నారు.

రష్యా చమురును కొనుగోలు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 27న భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, రష్యా అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనా. 2024లో చైనా US$62.6 బిలియన్ల విలువైన రష్యా చమురును దిగుమతి చేసుకోగా, భారతదేశం US$52.7 బిలియన్లను దిగుమతి చేసుకుంటుంది. అయినప్పటికీ, చైనా ప్రధాన పాత్రను విస్మరిస్తూ ట్రంప్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

ట్రంప్ యొక్క వాణిజ్య సలహాదారు పీటర్ నవారో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని 'మోదీ యుద్ధం'గా అభివర్ణించారు. న్యూఢిల్లీ నిరంతరం రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల మాస్కో సైనిక దూకుడు బలపడుతుందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవరో మాట్లాడుతూ.. "నా ఉద్దేశ్యం ఇది మోడీ యుద్ధం, ఎందుకంటే శాంతి మార్గం కొంతవరకు న్యూఢిల్లీ గుండా వెళుతుందన్నారు.

Next Story