కరోనా వైరస్‌ భారత్‌లో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలు సైతం విలవిలలాడుతున్నాయి. గంట గంటకు పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినా ఈ మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టడంతో కేసుల సంఖ్య కాస్త మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. లేకపోతే మరో ఇటలీ, చైనా, అమెరికా లాంటి పరిస్థితి దాపురించేది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1418 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. అయితే ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన ప్రార్థనలు దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. ప్రార్థనల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత రెండు రోజుల నుంచి కరోనావైరస్‌ తీవ్రతరమైంది.

ఇవాళ ఒక్క రోజు 13 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఒక్కరోజులోనే మృతుల సంఖ్య 45కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 123 మంది వరకు డిశ్చార్జ్‌ అయ్యారని కేంద్రం హెల్త్‌ బులటెన్‌లో తెలిపింది. అలాగే కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపింది మూడు రోజుల కిందట పరిస్థితి అదుపులో ఉండగా, ఢిల్లీ ప్రార్థనల నేపథ్యంలో కేసులు, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంకా కరోనా కేసులు పెరిగి అవకాశాలు ఉండటంతో ప్రజలకు మరింత భయాందోళన పట్టుకుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.