బిగ్‌బ్రేకింగ్‌ : 20 మందికి పైగా భారత జవాన్ల వీరమరణం!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 10:48 PM IST
బిగ్‌బ్రేకింగ్‌ : 20 మందికి పైగా భారత జవాన్ల వీరమరణం!

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే..! ముగ్గురు భారత జవాన్లు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 20 మంది భారత సైనికులు చనిపోయారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రభుత్వ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం లడఖ్ గల్వాన్ లో భారత్-చైనా సైనికుల మధ్య గొడవలో 20 మందికి పైగా భారత సైనికులు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.



సోమవారం ఉదయం భారత ఆర్మీ ముగ్గురు భారతకు చెందిన సైనికులు అమరులయ్యారని తెలిపింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేటకు చెందిన వ్యక్తి. బీహారు 16వ బెటాలియన్ లో సంతోష్ పని చేస్తున్నాడు.

Next Story