యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసుల షాక్, లుకౌట్‌ నోటీసులు జారీ

హైదరాబాద్‌లో యూట్యూబర్‌ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కీలక చర్యలు ప్రారంభించారు

By -  Knakam Karthik
Published on : 25 Feb 2026 3:46 PM IST

Telugu News, Telangana, Hyderabad, Andrapradesh, YouTuber Anvesh, Lookout Notice, Hyderabad Police, Panjagutta Police, Social Media Action

యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసుల షాక్, లుకౌట్‌ నోటీసులు జారీ

హైదరాబాద్‌లో యూట్యూబర్‌ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కీలక చర్యలు ప్రారంభించారు. అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి, విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇటీవల అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్లాట్‌ఫామ్‌ బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు, రెండు యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయని పేర్కొంటూ ఆయన మరో వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియా సంస్థలకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌ మరియు యూట్యూబ్‌కు అధికారిక లేఖలు రాయనున్నట్లు తెలిపారు. అన్వేష్‌ విదేశాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story