జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 23 Oct 2025 8:52 AM IST

Hyderabad News, jubileeHills Bypoll, Kcr, Brs, Ktr, Harishrao

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహాలపై క్లస్టర్‌ ఇన్‌చార్జులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు,ఇంచార్జిలు హాజరుకానున్నారు. బుధవారం కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

కాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లకు సంబంధించి కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్టు సిద్ధం కావడంతో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలని దానిపై సూచనలు చేయనున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి దీటుగా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానిపై కీలక సమావేశంలో కేసీఆర్ సూచనలు చేయనున్నారు. కాంగ్రెస్ మోసాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనేదానిపై బీఆర్ఎస్ అధినేత దిశా నిర్దేశం చేయనున్నారు. మరో వైపు తాను జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు ప్రచారంలో పాల్గొనేది నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Next Story