మెట్రో పిల్లర్స్ అన్ని బీఆర్ఎస్, బీజేపీ కొనేశాయి : వీహెచ్‌

కాంగ్రెస్ పోస్టర్లు సైతం పెట్టకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు

By Medi Samrat  Published on  15 Sep 2023 9:22 AM GMT
మెట్రో పిల్లర్స్ అన్ని బీఆర్ఎస్, బీజేపీ కొనేశాయి : వీహెచ్‌

కాంగ్రెస్ పోస్టర్లు సైతం పెట్టకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని మాజీ పీసీసీ అధ్య‌క్షుడు వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో పిల్లర్స్ అన్ని బీఆర్ఎస్, బీజేపీ కొనేశారని ఎన్. వి.ఎస్.ఎస్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే అనే అంశాన్ని మెట్రో ఎండీకి గుర్తుచేశాన‌ని తెలిపారు.

ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. సోనియాగాంధీ బొమ్మ కనిపిస్తే మార్పు వస్తుందన్న భయంతో.. కాంగ్రెస్ పోస్టర్లకు ఒక్క పిల్లర్ కూడా లేకుండా చేశారని మండిప‌డ్డారు. అవకాశం ఉన్నంతవరకూ పోస్టర్లు వేయాలని వీహెచ్‌ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story