ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాఫ్..మాగంటి సునీత హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు
By - Knakam Karthik |
ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాఫ్..మాగంటి సునీత హాట్ కామెంట్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రౌడీలతో భయపెట్టి ఓట్లు వేశారు, రౌడీల రాజ్యం మొదలైంది..ఎన్నికల జరిగిన రోజున రిగ్గింలు, గొడవలు చేశారు. నాలుగు ఐదు పార్టీలు కలిసి గెలిచారు.. అది గెలుపు కాదు. బిఆర్ఎస్ పార్టీ అనే ప్రతి ఒక్క కార్యకర్తనీ బెదిరించారు. నైతిక విజయం బిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మాగంటి సునీత నే గెలిచింది..బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్..ఆడ బిడ్డ ను ఎంత హింస పెట్టాలో అంత పెట్టారు. రౌడీయిజంతో ఎన్నికలు జరిగాయి. రిగ్గింగ్‌లు , రౌడీయిజంతో గెలిచారు. నన్ను ఓడించేందుకు అందరూ ఏకమయ్యారు..అని సునీత వ్యాఖ్యానించారు.
నేను మాట్లాడినా, నవ్వినా తప్పే అన్నట్లు చేసారు. దీన్ని గెలుపు అనరు..అడ్డదారిలో గెలిచారు. నైతికంగా నాదే గెలుపు. అన్ని పార్టీలు కలిస్తే..వాళ్లకు వచ్చిన మెజారిటీ. మేము సింగిల్ గా పోటి చేసాం. కౌంటర్ సెంటర్ లో కూడా ర్యాగింగ్ చేసారు. వాళ్లు ఇచ్చిన చీరలు కట్టుకున్నట్లుగా మాట్లాడారు. డబ్బు ,రౌడీయిజం ,రిగ్గింగ్ తో కాంగ్రెస్ గెలిచింది. గోపినాథ్ ఉన్నప్పుడు ఎలకల్లా ఉన్నవాళ్లంతా ఇప్పుడు రౌడీయిజం చలాయిస్తున్నారు..అని సునీత ఆరోపించారు.