మిత్రుడు పేరుతో భార్యతో చాటింగ్.. అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 12:14 PM GMT
మిత్రుడు పేరుతో భార్యతో చాటింగ్.. అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపి..

గచ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఓ విచిత్ర‌మైన‌ కేసు వెలుగుచూసింది. చెడు వ్య‌స‌నాల‌కు బానిసైన భ‌ర్త.. భార్య దగ్గర నుండి ఏకంగా కోటి రూపాయలు కొట్టేశాడు. వివ‌రాళ్లోకెళితే.. గ‌చ్చి‌బౌలి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో సంతోష్ అనే వ్యక్తి.. సాప్ట్‌వేర్ ఇంజనీర్ అయిన భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. భార్యకే.. మరొక వ్యక్తి పేరుతో మెసేజ్‌లు పంపి వేధింపులకు గురి చేసేవాడు.

ఈ నేఫ‌థ్యంలోనే అమెరికాలో ఉన్న భార్య దగ్గర నుంచి సంతోష్ కోటి రూపాయలు కొట్టేశాడు. మిత్రుడు పేరుతో భార్యతో చాటింగ్ చేసిన సంతోష్.. అశ్లీల వీడియోలు, ఫోటోలు పంపి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో భర్త సంతోష్‌పై అనుమానం వచ్చి భార్య సైబర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సంతోష్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ మహిళా పోలీసులు రిమాండ్‌కు పంపారు.

ఈ సంద‌ర్భంగా ఏసీపీ మాదాపూర్ శ్యామ్ మాట్లాడుతూ.. భార్యను మోసం చేసిన సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామ‌న్నారు. సంతోష్ గతంలో కూడా కొంతమంది మహిళలు పట్ల ఇదే విధంగా చేసినట్లు సమాచారం ఉందని.. చెడు వ్యసనాలకు బానిసైన‌ సంతోష్ భార్యను సైతం వేధించాడ‌ని ఏసీపీ పేర్కొన్నారు. సంతోష్‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Next Story
Share it