అచ్చెన్నాయుడుకి హైకోర్టు షాక్
By తోట వంశీ కుమార్ Published on 29 July 2020 12:24 PM ISTటీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. అలాఈగే ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులు వేసుకున్న అన్ని బెయిల్ పిటిషన్‌లను కూడా కొట్టేసింది. బెయిల్ పిటిషన్ వేసుకున్న వారిలో రమేశ్‌కుమార్, మురళీ సుబ్బారావు ఉన్నారు.
కాగా.. అచ్చెన్నాయుడు ఏపీ మంత్రిగా పని చేసిన సమయంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదట ఏసీబీ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించిన ఆయన.. అక్కడ ప్రయత్నాలు విఫలం కావడంతో హైకోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.