ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 4:14 PM GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమిస్తూ అధిష్ఠానం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు.

ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన హైకమాండ్.. పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది.

ఇదిలావుంటే.. గ‌త‌ ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. క‌న్నా రెండేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ అధినాయ‌క‌త్వం.. అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కన్నా స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజును అధ్య‌క్ష పీఠంపై క‌ర్చోబెట్టింది.

Next Story
Share it