తిరునల్వేలి ఫేమస్ హల్వా షాప్ ఓనర్ ఆత్మహత్య.. కారణం ఏమిటో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 3:19 PM GMT
తిరునల్వేలి ఫేమస్ హల్వా షాప్ ఓనర్ ఆత్మహత్య.. కారణం ఏమిటో తెలుసా..?

తమిళనాడు లోని తిరునల్వేలిలో 'ఇరుట్టు కడాయ్' హల్వా షాప్ చాలా ఫేమస్. ఆ షాప్ ఓనర్ హరి సింగ్ గురువారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఆయనకు కోవిద్-19 పాజిటివ్ అని తేలడమే..! తనకు కరోనా వచ్చిందన్న విషయం తెలిసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 80 సంవత్సరాల హరి సింగ్ ప్రైవేట్ ఆసుపత్రి లోని రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన గత రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కోడలు కూడా కోవిద్-19 పాజిటివ్ గా తేలింది.

యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ పలు టెస్టులు నిర్వహించారు. కోవిద్-19 టెస్టులు కూడా నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన తెలియగా.. మధ్యాహ్నం సమయానికి ఉరికి వేలాడుతూ కనిపించాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ తిరునల్వేలి సిటీ శరవణన్ తెలిపారు. ఒక టవల్ తో ఆయన ఉరి వేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

ఇరుట్టు కడాయ్ హల్వా షాపు స్వామి నెల్లాయప్పర్ దేవాలయానికి దగ్గరలో ఉంటుంది. పలు ప్రాంతాల నుండి వచ్చి ఈ స్వీట్ ను తినేసి వెల్తూ ఉంటారు. బాగా ఫేమస్ అయిన ఈ హల్వా షాపు హరి సింగ్ తండ్రి బిజిలి సింగ్ 50 ఏళ్ల కిందట స్థాపించాడు. చిన్న షాపు అయినా టేస్ట్ బాగా ఉండడంతో బాగా బిజినెస్ నడిచింది. సాయంత్రం 5 గంటలకు ఈ షాపును తెరుస్తారు. కేవలం 60 వాట్స్ బల్బ్ ను ఉంచి బిజినెస్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ హల్వా షాపుకు ఇరుట్టు కడాయ్ అనే పేరు వచ్చింది. ఆయన స్వీట్ తమిళనాడులో బాగా ఫేమస్ కావడంతో ఆయన మరణవార్త విన్న చాలామంది తమ బాధను వ్యక్తం చేశారు.

Next Story