వివాహిత ఆత్మహత్య..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 12:09 PM GMT
వివాహిత ఆత్మహత్య..

భర్త వేదింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ రాళ్లగూడకు చెందిన లావణ్య(32)కు జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఫైలట్‌ అయిన వెంకటేశంతో 8 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. పెళ్లైన కొంతకాలం ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. గత కొంత కాలంగా వెంకటేశం పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి లావణ్యకు వేదింపులకు గురిచేసేవాడు. పెళ్లైన ఇంతకాలం అయిన పిల్లలు పుట్టడం లేదని చిత్రహింసలు పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక లావణ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడింది. తన ఆత్మహత్యకు భర్తనే కారణం అని పేర్కొంది. ''వాడి మీద ప్రేమ ఉంది.. అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నా. వాడు చేసేవి తట్టుకోలేక చనిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమించాలని అనుకున్నాను. నేను తప్పులు చేసి రియలైజ్‌ అయ్యాను. కానీ, వాడు అవ్వటం లేదు. ’’ అంటూ వీడియోలో మాట్లాడింది. లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.

Next Story
Share it