మైనర్‌ బాలికపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 9:59 AM GMT
మైనర్‌ బాలికపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

దేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాధ్యత గల ఓ కానిస్టేబుల్‌ దారుణానికి ఒడిగట్టాడు. మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు కానిస్టేబుల్‌ మేనమామ వరుస అవుతాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో మైనర్ బాలిక(12) పై ఉమేష్ అనే కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ కావడంతో ఆ బాలిక ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఇదే అదునుగా బావించిన ఆ కామాంధుడు బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరించాడు. దీంతో బాలిక మిన్నుకుండిపోయింది. ఇదే అదునుగా నిత్యం వేదించసాగాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. బాలిక తల్లి బాలల హక్కు సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కమిషనర్‌ శిఖా గోయల్‌ దృష్టికి తీసుకెళుతానని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయాలన్నారు.

Next Story
Share it