పెళ్లైన 9 సంవత్సరాల తరువాత.. భార్య పురుషుడు అన్న సంగతి తెలిసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 11:35 AM GMT
పెళ్లైన 9 సంవత్సరాల తరువాత.. భార్య పురుషుడు అన్న సంగతి తెలిసి

ఆ మహిళకు పెళ్లై తొమ్మిది సంవత్సరాలు అయింది. ఇంత వరకు పిల్లలు లేరు. ఇటీవల ఆ మహిళ అనారోగ్యానికి గురైంది. డాక్టర్ల దగ్గరికి వెళితే.. పిడుగు లాంటి వార్త చెప్పారు. ఆమె మహిళ కాదని పురుషుడు అని బాంబు పేల్చారు డాక్టర్లు. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. ఈ ఘటన కోల్‌కత్తా నగరంలొ చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కోల్‌కత్తాలోని బీర్‌భమ్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను వైద్యలు పరిక్షించారు. ఆమె టెస్టిక్యులర్‌(వృషణ) క్యాన్సర్‌ బారిన పడినట్లు తేల్చారు. దీంతో పాటు మరో షాకింగ్‌ నిజం చెప్పారు. మెడికల్‌ రిపోర్టులో ఆమె పురుషుడి తేలింది. సాధారణంగా మహిళల్లో xx క్రోమోజోములు, పురుషుల్లో xy క్రోమోజోములు ఉంటాయన్న విషయం తెలిసిందే. కాగా.. ఆమెలో పురుషుల్లో ఉన్నట్లు xy క్రోమోజోములు ఉన్నాయి.

దీని గురించి ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దత్త మాట్లాడుతూ.. చూడటానికి ఆమె వందశాతం మహిళలాగే కనిపిస్తుంది. గొంతుతోపాటు అన్ని అవయవాలు అమ్మాయిలానే ఉంటాయి. శరీరంలోనూ మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయి. వీటి వల్లే ఆమెకు స్త్రీ రూపం వచ్చింది. అయితే ఆమెలో పుట్టుకతోనే గర్భాశయం, అండాశయం లేవు. దీని వల్ల సదరు మహిళకు ఇప్పటికీ రుతుస్త్రావం జరగలేదన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. 22వేల మందిలో ఒక్కరిలో ఇలా జరుగుతుందన్నారు. ఈ విషయమై ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. మరోవైపు ఆమె 28 ఏళ్ల సోద‌రికి ‘ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్’ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. జ‌న్యుప‌రంగా ఆమె అబ్బాయిలా జ‌న్మించిన‌ప్ప‌టికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే క‌నిపిస్తుంది. వీరి ర‌క్త సంబంధీకుల్లో ఇద్ద‌రికి ఇలాంటి వ్యాధి ఉండ‌టం వ‌ల్లే జ‌న్యువుల ద్వారా వీరికి వ్యాపించింద‌ని వైద్యులు పేర్కొన్నారు.

Next Story