గేదె బాగోగుల కోసం ఆరు రోజులు సెలవు అడిగిన కానిస్టేబుల్‌

By సుభాష్  Published on  26 Jun 2020 10:50 AM GMT
గేదె బాగోగుల కోసం ఆరు రోజులు సెలవు అడిగిన కానిస్టేబుల్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. విధుల నిర్వహిస్తున్న పోలీసులు పలు కారణాలతో సెలవులు కావాలంటూ కోరుతున్నారు. అయితే రాష్ట్రంలోని రేవాలో ప్రత్యేక ఆర్మీ దళంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ వినూత్నంగా సెలవు కావాలంటూ లేఖ రాశాడు. అదేంటంటే.. 'నా తల్లి గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా ఇంటి వద్ద ఓ గేదె కూడా ఉంది. అదంటే నాకు ఎంతో ఇష్టం. నేను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో విజయం సాధించేందుకు దాని పాలు కూడా ఒక కారణం. ఇటీవల ఆ గేదెకు ఓ దూడ కూడా జన్మించింది. దాని రుణం తీర్చుకునే సమయం వచ్చింది. నాకు ఆరు రోజులు సెలవు మంజూరు చేస్తే నా తల్లికి చికిత్స చేయించడంతో పాటు గేదె బాగోగులను కూడా చూసుకుంటాను' అంటూ ఆ పోలీస్‌ కానిస్టేబుల్‌ లేఖ రాస్తూ సెలవు కోరాడు. ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందుకు స్పందించిన పై అధికారి కారణం ఏదేమైనప్పటికీ.. సెలవు కోరిన వారికి తప్పకుండా ఇస్తానని తెలిపారు.

ఇలా గేదెకు సేవ చేసేందుకు, అతని తల్లి చికిత్స కోసం సెలవు కావాలని కోరడంపై ఆశ్చర్యపోతున్నారు. ఇవో ఇతర కారణాలు చూపిస్తూ సెలవు కోరుతున్న ఈ రోజుల్లో .. ఓ కానిస్టేబుల్‌ ఇలా గేదె కోసం సెలవు అడగడంపై ప్రశంసిస్తున్నారు.

Next Story