తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ లాటరీకి ఓకుటుంబం బలైంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన విషాదంగా మారింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ స్వర్ణకార కుటుంబ ఆన్‌లైన్‌లో లాటరీలలోమోసపోయి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.