Fact Check : వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల మీద దాడి చేశారా..?
YSRCP leaders did not attack policeman in Andhra Pradesh. కొందరు వ్యక్తులు పోలీసులను కొడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటో సామాజిక
By Medi Samrat Published on 23 Dec 2020 8:00 PM ISTకొందరు వ్యక్తులు పోలీసులను కొడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
"A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore," అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.
A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore. pic.twitter.com/Bp4RJgrQSf
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 18, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ దారుణంగా తయారైందని.. పోలీసుల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు వైసీపీ గూండాలు. రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణలేకుండా పోయింది. ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ ఆఫీసు దగ్గర పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.
A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore. pic.twitter.com/ydyNAkT96L
— Sekhar Vemuri (@Sekhar4TDP) December 18, 2020
ఇంకొందరు కూడా ఇదే విషయమై సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
"ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పరిస్థితే ఈవిధంగా ఉంటే ఇక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో మీరే ఆలోచించండి." అంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైసీపీ నాయకులు పోలీసుల మీద దాడి చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ కథనాలను ఖండించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ఈ కథనాల్లో ఎటువంటి నిజం లేదంటూ పోస్టు చేసింది.
#FactCheck: Respected Leader of Opposition party. @ncbn Sir your post is NOT Correct. The allegations are FALSE again. The YSRCP cadre was only helping Officer and massaging his injury after a fall. (1/3)@governorap @AndhraPradeshCM @AndhraPradeshHM @barandbench @naralokesh pic.twitter.com/9Ow4QrqJoM
— Andhra Pradesh Police (@APPOLICE100) December 18, 2020
నిజ నిర్ధారణ అనే ట్యాగ్ ను ఉపయోగించి మరీ ఈ కథనాల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా పడిపోయిన పోలీసు అధికారిని అటుగా వెళుతున్న కార్యకర్తలు సహాయం చేసి మరీ పైకి లేపారు. ఆయనకు ఏమైందో అని తెలుసుకున్నారు కూడానూ..! కిందపడి తలకు దెబ్బ తేలిందేమో అని తల మీద రుద్దారు.
సదరు పోలీసు అధికారిని మీడియా కూడా వివరణ అడగగా.. పడిపోయిన తనను లేపడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు తప్పితే తన మీద ఎవరూ ఎటువంటి దాడి చేయలేదని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ చేసుకోకుండా పోస్టు పెట్టారని పోలీసు విభాగం కూడా తెలిపింది.
"Dear Leader of the Opposition Chandrababu, your post is not correct. Once again, the allegations you have made are wrong. YCP activists there assisted the wounded police and examined the wounded man. We urge you to please co-operate with the police in maintaining peace and security in the state." అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పింది. చంద్రబాబు పెట్టిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించింది.
వైసీపీ నేతలు నడిరోడ్డు మీద పోలీసులను కొట్టారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.