ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాలో ఫాస్ఫరస్ బాంబులను జారవిడుచుతున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆకాశం నుండి భారీ సంఖ్యలో అగ్ని కీలల లాంటివి పడిపోతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఒక X ప్రీమియం వినియోగదారు ఈ వీడియోని “LATEST: Shocking! Israel’s air force drops white Phosphorus bombs on Gaza. (sic)” అంటూ పోస్టు చేశారు. తాజా వార్త.. షాకింగ్ విషయం.. ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాపై తెల్లటి ఫాస్ఫరస్ బాంబులను జారవిడిచిందని తెలిపారు.
ఇదే క్లెయిమ్‌తో ఫేస్‌బుక్‌లో కూడా వీడియోను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియోకు గాజా ఎటువంటి సంబంధం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన వీడియో ఇదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము YouTubeలో వీడియోకు సంబంధించిన పొడిగించిన వెర్షన్‌ని కనుగొన్నాము, మార్చి 13, 2023న ది టెలిగ్రాఫ్ ఈ వీడియోను ‘Russian shells rain down on Vuhledar as fight for Donbas rages on.’ అంటూ ప్రచురించింది. డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ షెల్స్ వర్షం కురిపించిందని తెలిపారు.
వీడియోలో ఆకాశం నుండి మండుతున్న లోహాలు పడుతున్నాయి. ఉక్రేనియన్ మాట్లాడే వ్యక్తుల వాయిస్ ను కూడా వినొచ్చు.
మేము మార్చి 12, 2023న ప్రచురించిన ది సన్ నివేదికలో, ‘యుద్ధంలో అత్యంత ఘోరమైన రోజు.. రష్యా 1,000 మందిని కోల్పోయిది, ఉక్రెయిన్ పట్టణంలో భయానక క్షణంలో థర్మైట్ రెయిన్ బాంబుల మెరుపు దాడి జరిగింది.
అనేక ఇతర వార్తా సంస్థలు, ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్‌లను ఉపయోగించి, ఉక్రెయిన్‌పై రష్యా చేసిన థర్మైట్ బాంబు దాడి గురించి నివేదించాయి.
కాబట్టి, ఈ వీడియోలో ఉన్నది గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
Credits : Md Mahfooz Alam