ప్రధాని నరేంద్ర మోదీ ఖాసీ దుస్తుల్లో ఉన్న ఫొటోను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తూ.. మహిళ దుస్తులను ధరించారని చెబుతూ ట్రోల్ చేస్తున్నారు. PM ఫోటోతో పాటు అదే విధమైన దుస్తుల స్క్రీన్‌షాట్ కూడా ఉంది. ప్రధాని మోదీ స్త్రీ వస్త్ర ధారణలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఆ డ్రెస్ ధర $35 అని స్క్రీన్‌షాట్ చూపిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ట్విట్టర్‌లో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ప్రధానిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు.
నిజ నిర్ధారణ :
ప్రధాని వేషధారణ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లో మోదీ ఫోటోలలో ముడతలు ఉన్నట్లు న్యూస్‌మీటర్ గుర్తించింది. ఇది మార్ఫింగ్ అయి ఉండొచ్చని మాకు అనిపించింది.
మేము "multi-floral embroidered dress" అంటూ గూగుల్ లో సెర్చ్ చేశాము. షోర్‌లైన్ వేర్ వెబ్‌సైట్‌లో $35 ఖరీదు చేసే పూల ఎంబ్రాయిడరీతో కూడిన నల్లటి దుస్తులు కనిపించాయి. వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ USలో ఉంది.
వెబ్‌సైట్‌లోని దుస్తులను స్క్రీన్‌షాట్‌తో పోల్చినప్పుడు, వైరల్ స్క్రీన్‌షాట్‌లో అసలు ప్రోడక్ట్ నెక్‌లైన్ కనిపిస్తుందని మేము కనుగొన్నాము.
యుఎస్ ఆధారిత షాపింగ్ వెబ్‌సైట్ నుండి తీసిన వైరల్ స్క్రీన్‌షాట్‌లో ప్రధాని మోదీ ధరించిన సాంప్రదాయ ఖాసీ దుస్తులు డిజిటల్‌గా ఎడిట్ (సూపర్మోస్) చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల, స్క్రీన్‌షాట్ మార్ఫింగ్ చేశారని.. ప్రధాని మోదీ స్త్రీ దుస్తులు ధరిస్తున్నారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.
ది ప్రింట్ కథనం ప్రకారం, డిసెంబర్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేఘాలయలో పర్యటించారు. ఆయన షిల్లాంగ్‌లో సంప్రదాయ ఖాసీ దుస్తులతో పాటు గారో టోపీని ధరించి రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతికి గౌరవం ఇచ్చాడు. ఈ పర్యటనలో రూ. 2,450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.