భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలను విమర్శిస్తూ ఓ మహిళ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మోదీ, అమిత్ షాలు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారంటూ ఆ మహిళ ఆరోపణలు గుప్పించింది. మోదీ, అమిత్ షాలను తిడుతూ ఉన్నది మనేక గాంధీ అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలైన మనేక గాంధీ మోదీ, అమిత్ షాలను విమర్శిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేశారు. అన్ని విషయాలలోనూ మీరు ఫెయిల్ అయ్యారని.. శవాల మీద రాజకీయాలను చేయడం నేర్చుకున్నారని ఆమె ఎమోషనల్ అయి చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి పీఠంపై మోదీకి ఎంతో మమకారం ఉందని ఆమె విమర్శించారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ మనేక గాంధీ ఫోటోలను, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మహిళకు సంబంధించిన ఫోటోలను పరిశీలించగా.. ఆ మహిళ మనేక గాంధీ కాదని స్పష్టంగా తెలుసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మహిళ వయసు 36 సంవత్సరాలు కాగా.. మనేక గాంధీ వయసు 60ల్లో ఉంది. ఈ వీడియోలో ఉన్నది మనేక గాంధీ కాదని స్పష్టంగా తెలుస్తోంది.


ట్విట్టర్ వీడియోల కింద ఉన్న కామెంట్లను బట్టి.. వీడియోలో ఉన్నది మనేక గాంధీ కాదని కాంగ్రెస్ మహిళా నేత డోలీ శర్మ అని స్పష్టమవుతోంది. ఘజియాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత డోలీ శర్మ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు ఫోటోలలోనూ తేడాలను గమనించవచ్చు.


డోలీ శర్మ తన ఫేస్ బుక్ పేజీలో ఏప్రిల్ 20న లైవ్ వీడియో చేశారు. అందులో 23 నిమిషాల పాటూ మాట్లాడారు. కోవిద్-19 ను కట్టడి చేయడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. ఆమె వీడియోకు చెందిన ఓ క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆమె మనేక గాంధీ అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు.

ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నాయకురాలు మనేక గాంధీ కాదు. కాంగ్రెస్ నేత డోలీ శర్మ. వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.
Claim Review :   మోదీ, అమిత్ షా లను మనేక గాంధీ విమర్శిస్తూ వీడియో చేశారా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story