FactCheck : ఉత్తరాఖండ్‌లో మసీదును కూల్చివేశారా?
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగా ఆక్రమణలుగా ముద్ర పడిన అనేక నిర్మాణాలను కూల్చివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగా ఆక్రమణలుగా ముద్ర పడిన అనేక నిర్మాణాలను కూల్చివేశారు. వీటిలో మసీదులు, పలు పుణ్యక్షేత్రాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.
ఈ సందర్భంలో ఆకుపచ్చ, తెలుపు రంగు ఉన్న భవనాలను కూల్చివేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ఉత్తరాఖండ్‌లో ఒక మసీదును కూల్చివేశారని చెబుతూ ఉన్నారు.
"దేవభూమి ఉత్తరాఖండ్ నుండి ఓదార్పునిచ్చే వీడియో అందింది" అనే శీర్షికతో అనేక మంది X వినియోగదారులు వీడియోను పంచుకున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినది. మసీదు కూల్చివేతకు సంబంధించింది కాదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, వైరల్ క్లిప్‌లో కనిపించిన దానితో సహా బహుళ నిర్మాణాల కూల్చివేతను చూపించే నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో మార్చి 9న ఇండోనేషియా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆ ఛానల్ ప్రకారం, ఇండోనేషియా రాజకీయ నాయకుడు, పర్యావరణ ప్రేమికుడు కాంగ్ దేడి ముల్యాడి వరదలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసారు. అలాగే అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం పోరాటం చేశారు.
ఇండోనేషియా మీడియా సంస్థ కొంపాస్ మీడియా గ్రూప్ యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ప్రచురించిన వీడియో నివేదికలలో నిర్మాణం కూల్చివేతకు సంబంధించిన ఫుటేజ్‌ను కూడా మేము కనుగొన్నాము.
నివేదికల ప్రకారం, ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని బోగోర్‌లో ఆకస్మిక వరదలకు ఈ నిర్మాణాలే కారణమని ఆరోపించిన తర్వాత, ప్రభుత్వం మార్చి 6, 2025న పర్యాటక ప్రదేశమైన హైబిస్కస్ ఫాంటసీ పుంకాక్‌ను సీలు చేసి కూల్చివేసింది. పర్యావరణ మంత్రి హనీఫ్ ఫైసోల్, పశ్చిమ జావా గవర్నర్ దేడి ముల్యాడి సహా ఉన్నతాధికారుల నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ విపత్తుకు ప్రతిస్పందనగా నిర్వహించారు.
ఈ అక్రమ నిర్మాణాలు వరదలకు కారణమయ్యాయని ముల్యాడి పేర్కొన్నారు. వరద బాధితులు కూడా కూల్చివేతకు మద్దతు ఇచ్చారు, ఈ ప్రక్రియలో సహాయం చేశారు.
CNN ఇండోనేషియా ప్రచురించిన, కొంపాస్ వెబ్‌సైట్‌లో హైబిస్కస్ ఫాంటసీ పుంకాక్‌లోని కూల్చివేసిన ఆకుపచ్చ తెలుపు భవనం ఏరియల్ వ్యూ చిత్రాన్ని మేము కనుగొన్నాము.
కొంపాస్ వెబ్ సైట్ ప్రకారం పశ్చిమ జావా గవర్నర్ దేడి ముల్యాది ఈద్‌కు ముందు ఈ ప్రాంతంలో అనుమతులు లేని భవనాల కూల్చివేతను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, నిషేధిత మండలాల్లో ఉన్న వాటితో సహా సరైన అనుమతులు లేని 25 నిర్మాణాల కూల్చి వెతలపై దృష్టి సారించారు.
కాబట్టి, ఆ వీడియో ఉత్తరాఖండ్‌లో మసీదు కూల్చివేతను చూపించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు.
Credits : Md Mahfooz Alam