ఉప్పెన విజయ్ దేవరకొండతో చెయ్యకపోవడానికి కారణం ఏమిటి?

Vijay Devarakonda Is First Hero In Uppena Movie. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన సినిమా శుక్రవారం చాలా గ్రాండ్

By Medi Samrat  Published on  13 Feb 2021 11:12 AM GMT
ఉప్పెన విజయ్ దేవరకొండతో చెయ్యకపోవడానికి కారణం ఏమిటి?

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన సినిమా శుక్రవారం చాలా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఓపెనింగ్స్ తోనే సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.అయితే ఈ ఉప్పెన కథ రాసుకున్నప్పుడు వైష్ణవ్ తేజ్ ను కాకుండా దర్శకుడు మొదట విజయ్ దేవరకొండను మనసులో అనుకున్నాడట.

అయితే విజయ్ కు ప్రస్తుతం ఉన్న రేంజ్ వేరు. అతని క్రేజ్ డిఫరెంట్. ఇప్పుడున్న స్థాయికి ఉప్పెన కథ ఏ మాత్రం సెట్టవ్వదని అనిపించినట్లు చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు.ఇక ఆ తరువాత వైష్ణవ్ తేజ్ అయితే కరెక్ట్ సెట్టవుతాడాని ఫొటో చూసినపుడే అర్థమయ్యినట్లు చెప్పాడు. వైష్ణవ్ తేజ్ ను మొదట ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసి సెలెక్ట్ చేసినట్లు చెప్పిన బుచ్చిబాబు అతను కళ్ళు చూసి ఎక్కువగా ఎట్రాక్ట్ అయినట్లు చెప్పాడు.

ఆశీర్వాదం క్యారెక్టర్ కు వైష్ణవ్ 100% న్యాయం చేశాడని సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫీల్ కలుగుతుందని చెప్పాడు. ఇక వైష్ణవ్ తేజ్ కు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని వివరణ ఇచ్చాడు.


Next Story