సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూత..!

Veteran music director Raam Laxman dies at 79 in Nagpur. బాలీవుడ్ కు చెందిన మరొక దిగ్గజం తుదిశ్వాస విడిచారు. సీనియర్ సంగీత దర్శకుడు

By Medi Samrat  Published on  22 May 2021 10:03 AM GMT
సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూత..!

బాలీవుడ్ కు చెందిన మరొక దిగ్గజం తుదిశ్వాస విడిచారు. సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కరోనాతో కన్నుమూశారు. 78 ఏళ్ల రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2 గంట‌ల‌కు మరణించినట్లు ఆయ‌న కుమారుడు అమ‌ర్ తెలిపారు. ఇటీవ‌లే రామ్ లక్ష్మణ్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నార‌ట.. అప్పటి నుంచి చాలా నీర‌సంగా, బ‌లహీనంగా క‌నిపించార‌ని అమర్ చెప్పారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమాకు తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించారు. ఆ తర్వాత ఏడాదే సురేంద్ర మరణించడంతో, విజయ్ పాటిల్ తన మిత్రుడి జ్ఞాపకార్థం రామ్ లక్ష్మణ్ పేరుతోనే కొనసాగడం విశేషం. హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన బాణీలు సమకూర్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై పాటలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. 1999 లో వీ ఆర్ టుగెద‌ర్ అనే సినిమాకు ఆఖరి సారిగా సంగీతాన్ని అందించారు.


Next Story