దుమ్ములేపుతున్న 'వకీల్ సాబ్' ట్రైలర్

Vakeel Saab Trailer. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ విడుదలై దుమ్ములేపుతుంది

By Medi Samrat  Published on  29 March 2021 9:22 PM IST
దుమ్ములేపుతున్న వకీల్ సాబ్ ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ట్రైలర్ విడుదలై దుమ్ములేపుతుంది. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు.

ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం ఆరు గంట‌ల‌కు విడుదల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్‌ రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల న‌టిస్తున్నారు.

ట్రైలర్‌ విషయానికి వస్తే.. టైటిల్‌కి తగినట్లే స్టార్టింగే కోర్టు సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై పవన్‌ కల్యాణ్‌, ప్రకాష్‌ రాజ్‌ ల మధ్య వాద, ప్రతివాదనలతో కోర్ట్‌ సీన్‌ దద్దరిల్లిపోయేలా స్టార్ట్‌ అయిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేదిగా ఉంది.

అన్యాయంగా కేసులో బుక్కయిన ముగ్గురు అమ్మాయిలు.. న్యాయం కోసం పోరాడి పోరాడి విసిగిపోయిన టైమ్‌లో.. లాయర్‌ రూపంలో పవన్‌ వారికి దేవుడిలా కనిపించడం.. వారి తరపున వాదించి.. వారిని ఎలా ఈ కేసులో నుంచి బయటికి తీసుకువచ్చాడనేది అర్థమవుతుంది. మొత్తానికి మూడేళ్ల విరామం త‌ర్వాత ప‌వ‌న్ ఫ్యాన్స్ కు మాంచి ట్రీట్ ఇచ్చాడు. మూడు గంట‌ల్లోనే 22 ల‌క్ష‌ల వ్యూస్ తో దూసుకుపోతుంది..


Next Story