పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు అందుకుంది. ఇక ఇప్పుడు ప్రైమ్ వీడియోలో విడుదలైంది. సినిమా రిలీజ్ సమయంలో చాలా మంది గుర్తించని ఓ విషయాన్ని తాజాగా అభిమానులు స్ట్రీమింగ్ సమయంలో గుర్తించారు. అదేమిటంటే సినిమా స్టార్టింగ్ లో వచ్చే పవర్ స్టార్ అనే పేరు.

ప్రతి సినిమాకు కూడా పవర్ స్టార్ అని వస్తుంది కదా.. అందులో ఏముంది కొత్తగా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఈ సినిమాలో మాత్రం పవర్ స్టార్ పడే సమయంలో పంచ భూతాలతో కలిసి ఓ స్టార్ అన్నది తయారవుతుంది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న భారీ అభిమానంతో ఈ రేంజిలో సృష్టించారు. సినిమా హాళ్లలో రిలీజ్ అయినప్పుడు సందడి కారణంగా దీన్ని గుర్తించలేకపోయారు కానీ.. ఇప్పుడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

పంచభూతాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి.. ఆ తర్వాత పవర్‌స్టార్ అని వచ్చేలా టైటిల్‌కార్డును డిజైన్ చేయించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ పంచభూతాల కాన్సెప్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వేణు శ్రీరామ్.. ఊర మాస్ అని చెబుతూ ఉన్నారు. హిందీలో వచ్చిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే..! హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులో సినిమాను మాస్ కు కనెక్ట్ అయ్యేలా తీశారు. పవన్ కళ్యాణ్ హీరోయిజానికి కావాల్సిన ఫైట్స్, ఎలివేషన్స్ ను కూడా యాడ్ చేశారు.
సామ్రాట్

Next Story