నిజంగానే 'ఉప్పెన' సృష్టిస్తున్న కలెక్షన్లు!

Vaishnav Tej Uppena Movie Collection. చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే

By Medi Samrat  Published on  13 Feb 2021 9:08 AM GMT
నిజంగానే ఉప్పెన సృష్టిస్తున్న కలెక్షన్లు!

చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్ల‌స్ పాయింట్ అయింది. శ్రీమ‌ణి రాసిన‌ 'నీ క‌న్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు.

ఇక ఈ సినిమాని 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 12న(నిన్న) విడుదలవ్వడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని…'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట మొదటి సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి.దాంతో మొదటి రోజు ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఇక 'ఉప్పెన' సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రానికి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. దాంతో సంబంధం లేకుండా 10.42 కోట్ల షేర్ నమోదు చేసింది . డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
Next Story