ఓటీటీలోకి ఊర్వశివో.. రాక్షసివో..

Urvasivo Rakshasivo OTT Release Date. అల్లు శిరీష్ హీరోగా ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమా వచ్చింది. ‘ఏబిసిడి’ తర్వాత నాలుగేళ్ళు గ్యాప్‌

By Medi Samrat  Published on  2 Dec 2022 5:45 PM IST
ఓటీటీలోకి ఊర్వశివో.. రాక్షసివో..

అల్లు శిరీష్ హీరోగా ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సినిమా వచ్చింది. 'ఏబిసిడి' తర్వాత నాలుగేళ్ళు గ్యాప్‌ తీసుకుని ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నవంబర్‌ 4న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్‌ 9 నుండి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. అల్లు శిరీష్‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌ నటించింది.

'శ్రీరస్తు శుభమస్తు' మినహా సరైన విజయం లేని అల్లు శిరీష్.. 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో మరో హిట్ అందుకుంటాడని భావించారు. అను ఇమాన్యుయెల్ కథానాయికగా కనిపించిన ఈ రొమాంటిక్ సినిమాకు యూత్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Next Story