ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ రికార్డు.. యూట్యూబ్ లో పవన్ పాట సరికొత్త రికార్డు
Tollywood Records. ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ రికార్డు.. యూట్యూబ్ లో పవన్ పాట సరికొత్త రికార్డు
By Medi Samrat Published on 7 Sept 2021 3:49 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్స్ ను ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంతో ఇంతో ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. రెండేళ్ల క్రితం ఇంస్టా గ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ కి చేరుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే 'రాధేశ్యామ్' చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్', ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నారు. త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ కూడా మొదలు కానుంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాట కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ.. 'భీమ్లా నాయక్' నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. టైటిల్ సాంగ్ థమన్ సంగీత సారథ్యంలో రూపొందగా, దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా.. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.