థ్యాంక్ యు బ్రదర్ మూవీ 'రివ్యూ'.. సినిమా ఎలా ఉందంటే..

Thank You Brother Movie Review. యంగ్ హీరో విరాజ్ అశ్విన్ హీరోగా, ప్రముఖ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో

By Medi Samrat  Published on  7 May 2021 1:48 AM GMT
థ్యాంక్ యు బ్రదర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

రేటింగ్ : 2

నటీనటులు : విరాజ్ అశ్విన్, నటి, యాంకర్ అనసూయ, అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ,

దర్శకుడు : ర‌మేశ్ రాప‌ర్తి

స్క్రీన్ ప్లే ; ర‌మేశ్ రాప‌ర్తి

సంగీతం : గుణ బాలసుబ్రమణియన్

నిర్మాతలు : మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి

యంగ్ హీరో విరాజ్ అశ్విన్ హీరోగా, ప్రముఖ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'థాంక్యూ బ్రదర్'. ఈ సినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించగా కొత్త దర్శకుడు ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వం వహించారు. కాగా ఆహా యాప్ లో మే 7వ తేదీన రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అభి (విరాజ్ అశ్విన్ ) మోడ్రన్ కుర్రాడు. చెడు అలవాట్లకు అలవాటు పడి తన తల్లిని , అలాగే తన బాధ్యతలను పట్టించుకోకుండా సరదగా గడిపేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా అభి తన తల్లితో గొడవ పడి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రియ (అనసూయ) నిండు గర్భవతి, అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉంటాడు. ఆమె కూడా కష్టపడుతూ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇలా కొన్ని సమస్యలతో బాధ పడుతున్న అభి, ప్రియ అనుకోకుండా ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. ఆ సమయంలో ప్రియకు నొప్పులు మొదలవ్వడంతో అభిలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తల్లి అవ్వడానికి ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందో అభి అర్ధం చేసుకుంటాడు. మరి ప్రియను అభి ఎలా సేవ్ చేశాడు ? చివరకు అనసూయ అలాగే ఆమెకు పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని ఆహా యాప్ లో చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమాలో చర్చించిన మెయిన్ పాయింట్ చాల బాగుంది. ముఖ్యంగా తల్లి విలువ తెలుసుకునే ఒక కొడుకు కథగా సాగిన ఈ సినిమాలో ఓ స్త్రీలోని తల్లి తనాన్ని దర్శకుడు చాల బాగా చూపించాడు. అలాగే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ పెర్ఫామెన్స్, అలాగే ప్రధాన పాత్ర పోషించిన అనసూయ నటన మొత్తానికి ప్రేక్షకులను మెప్పించింది. ఇక కమెడియన్ వైవా హర్ష రెండు సార్లు నవ్వించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

కాకపోతే దర్శకుడు మొదట్లో కొన్ని బోల్డ్ అండ్ కిస్ సీన్స్ విషయంలో కాస్త లిమిట్ లో ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసేది. నిజానికి ఎమోషనల్ డ్రామాలో బోల్డ్ కంటెంట్ ఎప్పుడూ సెట్ అవ్వదు. ఇక పాయింట్ పరంగా, ఎమోషనల్ పరంగా మంచి కంటెంట్ తీసుకున్న దర్శకుడు రమేష్, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమాలో కీలక సన్నివేశాలు సాగదీసినట్లు చాల స్లోగా సాగుతాయి.

నిజానికి ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నా... దర్శకుడు మాత్రం తనకు తోచిందే రాసుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే, మంచి స్క్రీన్ ప్లే, అండ్ గుడ్ డైలాగ్స్ ను రాయించుకోవడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పైగా తల్లి సెంటిమెంట్ తో సాగే సినిమాలో, ఆ తల్లి పాత్రలో అసలు నిజాయితీనే లేకపోవడం బాధాకరమైన విషయం.

ప్లస్ పాయింట్స్ :

కథలో చెప్పాలనుకున్న కీలకమైన కథాంశం,

కొన్ని ఎమోషనల్ సీన్స్.

మైనస్ పాయింట్స్:

బోరింగ్ స్క్రీన్ ప్లే,

డల్ గా సాగే డైలాగ్స్,

నటీనటుల ఓవర్ యాక్షన్,

నీరసంగా సాగే డైరెక్షన్,

బ్యాడ్ ట్రీట్మెంట్,

కెమెరా వర్క్,

చివరగా :

సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా.. ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బలంగా చూపించడంలో, అలాగే ఆకట్టుకునేలా ఈ సినిమాని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు ర‌మేశ్ రాప‌ర్తి పూర్తిగా విఫలం అయ్యాడు. మొత్తమ్మీద ఈ 'థాంక్యూ బ్రదర్' చిత్రం స్లో నేరేషన్ తో పాటు అలాగే బోరింగ్ ప్లేతో ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా ఈ సినిమాని మీరు చూడక పోవడమే మంచిది.


Next Story