కుర్రకారుకి నిద్రపట్టకుండా చేస్తున్న టాలీవుడ్ యాంకర్లు
Telugu Anchors Raise Heat With Glamour Show. ఈ మధ్య పాపులర్ కావాలన్నా.. అవకాశాలు పొందాలన్నా ఫొటోషూట్‌లు
By Medi Samrat Published on 13 Feb 2021 2:03 PM ISTఈ మధ్య పాపులర్ కావాలన్నా.. అవకాశాలు పొందాలన్నా ఫొటోషూట్‌లు కామన్. ఇక ఈ విషయంలో హీయిన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు గ్లామర్ షో కేవలం హీరోయిన్స్ మాత్రమే చేసేవారు. ఇప్పుడలా కాదు కథానాయికలతో పోటీ పడుతూ రెచ్చిపోయి అందాల ఆరబోస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ మొదలు హాట్ హాట్ గా అందాలు ఆరబోయటానికి రెడీ అవుతున్నారు. ఆ మద్య జబర్ధస్త్ యాంకర్ రష్మి నటించి బోల్డ్ చిత్రాలే ఇందుకు ఉదాహారణ. ఒకప్పుడు టాప్ మోడల్స్, స్టార్ హీరోయిన్లు ఫోటో షూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. బుల్లితెర యాంకర్‌లు అనసూయ, శ్రీముఖి, రష్మీగౌతమ్, `పోరా పోవే` యాంకర్ విష్ణు ప్రియ.. వీళ్లంతా కూడా ఫొటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.
ప్రొగ్రామ్‌ని రక్తికట్టించాలంటే టాలెంట్ వుంటే సరిపోతుంది.. అయితే మన యాంకరమ్మలు మాత్రం అంతకు మించి ఎట్రాక్ట్ చేయాలంటే హాట్ ఫొటో షూట్‌లు చేయాల్సిందే అంటూ హంగామా చేస్తున్నారు. ఈ మద్య శ్రీముఖి గోవా వెళ్ళిన శ్రీ బీచ్‌లో ఫొటో షూట్స్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అయ్యాయి. అంతే కాదు రీసెంట్‌గా పేపర్ లాంటి పొట్టి దుస్తులు ధరించి అందాలను ఆరబోసి అగ్గిరాజేసింది. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు.
అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. చిరకట్టుతోనే ఆకర్షిస్తుంది. రష్మి గౌతమ్ ఓ అడుగు ముందుకు వేసి హాట్ లుక్ తో సినిమాల్లో సందడి చేసింది. పోరా పోవే ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఈ మధ్య గ్లామర్ షోతో హాట్ టాపిక్‌గా మారుతుంది. అందాలు కనిపించేలా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఇలా వెండితెరపై రాణించేందుకు బుల్లితెరను వేధికగా చేసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.