నయిమ్‌ డైరీస్ సినిమాను అడ్డుకున్న తెలంగాణ‌ ఉద్య‌మ‌కారులు

Telangana activists block Naeem Diaries movie. నయిమ్ డైరీస్ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు.

By Medi Samrat  Published on  10 Dec 2021 10:13 AM GMT
నయిమ్‌ డైరీస్ సినిమాను అడ్డుకున్న తెలంగాణ‌ ఉద్య‌మ‌కారులు

నయిమ్ డైరీస్ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీల‌క పాత్ర పోషించిన‌ బెల్లి లలితను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సినిమాను అడ్డుకున్నారు. ఈ మేర‌కు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళన చేప‌ట్టారు. థియేటర్ ముందు బైఠాయించిన ఉద్య‌మ‌కారులు నయీమ్ డైరిస్ సినిమా పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు. సంధ్య 35 ఎం ఎం థియేటర్లో సినిమా విడుదల కాకుండా ఉద్యమకారులు అడ్డుకున్నారు.

ఈ సినిమాను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించామ‌ని ఉద్య‌మ‌కారులు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను కించపరిచే సినిమాలు రద్దు చేయాలని ఉద్యమకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ మాట్లాడుతూ.. కొంత మంది ఉద్యమకారులు వచ్చి సినిమా విడుదలను అడ్డుకున్నారని తెలిపారు. మా యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశాము. మార్నింగ్ షో సినిమా ను నిలిపివేశాం. యాజమాన్యం నుండి వచ్చే సమాచారాన్ని బట్టి సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామ‌ని అన్నారు.


Next Story
Share it