Superstar Rajinikanth seeks the central government permission to travel to the USA. గత కొద్దినెలలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం
By Medi Samrat Published on 14 Jun 2021 10:05 AM GMT
గత కొద్దినెలలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం గురించి అభిమానుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే..! ఆరోగ్యం సహకరించకపోవడంతో రజనీ రాజకీయ అరంగేట్రం కూడా జరగలేదు. ఇక సినిమాల విషయంలో కూడా కొన్నాళ్ళకు ఆయన రిటైర్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి.
తాజాగా రజనీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికాకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. వైద్య పరీక్షల కోసం రజనీకాంత్ అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అనుమతులు కోరారు. అమెరికాకు వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వాలని రజనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లనున్నారు.
14 మంది ప్రయాణించగల ప్రత్యేక విమానంలో రజనీకాంత్ తన కుటుంబ సభ్యులను కూడా తీసుకుని వెళ్లనున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇప్పటికే అమెరికాలో తన భార్య కుమారులతో కలిసి ఉన్నారు. ధనుష్ తన హాలీవుడ్ చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు. దీంతో అమెరికాలో రజనీకాంత్ కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నారు.
రజనీకాంత్ 'అన్నాతే' సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో రజనీ సర్పంచ్ పాత్రలో కనిపించనున్నారు. లాక్డౌన్ కు కొన్ని నెలల ముందు ఈ చిత్ర షూటింగ్ ను ఆపేశారు. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.