ఆర్ఆర్ఆర్‌పై మ‌హేశ్ ప్ర‌శంస‌లు..

Superstar Mahesh Called Rajamouli's Latest Movie a EPIC. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరికీ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది.

By Medi Samrat  Published on  26 March 2022 12:05 PM GMT
ఆర్ఆర్ఆర్‌పై మ‌హేశ్ ప్ర‌శంస‌లు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరికీ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కొన్ని వాయిదాల అనంత‌రం, ఈ అధిక-బడ్జెట్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ నిన్న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా న‌టించిన ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ రివ్యూలను అందుకుంటున్నారు. సినిమా అఖండ విజయం సాధించినందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాను, రాజమౌళిని ప్రశంసిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సినిమా విజయంపై, నటీనటుల పనితీరును ప్రశంసించారు. మ‌హేష్‌.. ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫిక్‌ అని ట్వీట్ చేసాడు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు తన శుభాకాంక్షలు తెలియజేసాడు. గ్రాండ్ విజువ‌ల్స్, ఎమోష‌న్స్‌, మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కేవలం మంచి క‌థ‌కుడు మాత్ర‌మే ఇది చేయ‌గ‌ల‌డు. సెన్సేష‌న‌ల్ ఫిల్మ్‌మేకింగ్ లో రాజ‌మౌళి మాస్ట‌ర్‌. తార‌క్‌, చెర్రి స్టార్ డ‌మ్‌ను మించి ఎదుగుతున్నారు. నాటునాటు పాట‌లో గురుత్వాక‌ర్ష‌ణ సిద్దాంతం ప‌నిచేయ‌లేదు. నిజానికి వారు గాల్లో ఎగిరారు. ఆర్ఆర్ఆర్ టీంకు అభినంద‌న‌లు అని ట్వీట్ చేశారు.Next Story
Share it