మహేష్ బాబు.. ఊరమాస్ టీజర్

Super Star Birthday BLASTER. మహేష్ బాబు గత సినిమాలు చూస్తే.. సోషల్ మెసేజీలు ఉండడమే కనిపిస్తుంది. ఊర మాస్ ఎంటర్టైనర్

By Medi Samrat  Published on  9 Aug 2021 8:57 AM IST
మహేష్ బాబు.. ఊరమాస్ టీజర్

మహేష్ బాబు గత సినిమాలు చూస్తే.. సోషల్ మెసేజీలు ఉండడమే కనిపిస్తుంది. ఊర మాస్ ఎంటర్టైనర్ ను అభిమానులకు మహేష్ బాబు ఇచ్చి చాలా కాలమే అయింది. ఇక ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' సినిమా టీజర్ ను విడుదల చేశారు. మహేష్ బాబు ఈసారి మాత్రం ఊరమాస్ ఎంట్రీ ఇచ్చాడు. కొత్త హెయిర్ స్టైల్.. సరికొత్త గెటప్ తో టీజర్ లో అదరగొట్టేశాడు మహేష్ బాబు. ఏది ఏమైనా అభిమానులకు కావాల్సిన లుక్ తో మహేష్ బాబు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నాడు. ఆగష్టు 9 ఉదయం 9:09కి టీజర్ ను విడుదల చేయాలని సర్కారు వారి పాట యూనిట్ భావించింది. కానీ అర్ధ రాత్రి సమయంలో టీజర్ లీక్ అయిపోవడంతో చిత్ర యూనిట్ అఫీషియల్ గా టీజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది.


మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న 'సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌' పేరుతో ఈ వీడియో విడుదల చేశారు మూవీ యూనిట్‌. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించాడు. యాక్షన్ కూడా అదరగొట్టేశాడు మహేష్ బాబు. లాస్ట్ లో హీరోయిన్ ను తీజ్ చేస్తూ చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. 'ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్' , 'ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌' అంటూ మహేష్ బాబు డైలాగ్స్.. కీర్తి సురేశ్‌ మహేశ్‌కు హారతి ఇస్తూ 'సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి' అని చెప్పగానే మహేశ్‌ ఇచ్చే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకుంటూ ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తూ ఉన్నాడు. మీరు కూడా టీజర్ పై ఓ లుక్ వేయండి..!


Next Story