ఆస‌క్తిక‌రంగా సునీల్ 'క‌న‌బ‌డుట‌లేదు' టీజ‌ర్‌

Sunil Kanapadutaledhu Teaser Release. సునీల్ హీరోగా నటిస్తున్న కనబడుటలేదు సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో సునీల్ డిటెక్టీవ్ గా

By Medi Samrat  Published on  26 Jun 2021 4:25 PM IST
ఆస‌క్తిక‌రంగా సునీల్ క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌

సునీల్ హీరోగా నటిస్తున్న కనబడుటలేదు సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో సునీల్ డిటెక్టీవ్ గా సందడి చేయనున్నాడు. ఈ టీజర్ ను చూస్తుంటే ఓ మిస్సింగ్ కేసు చుట్టూ సాగే ఇన్వెస్టిగేష‌న్‌ లా కనిపిస్తుంది. పోలీసుల‌కు అంతుప‌ట్ట‌ని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా చేధించాడనేది సస్పెన్స్ నడుస్తూ సాగుతుంది. నేర ప‌రిశోధ‌న చిత్రాలు ఎలా ఉంటాయో.. ఆ ఫార్మెట్ లోనే క‌నిపించింది. టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… అన్నీ బాగున్నాయి.


కమెడియన్ గా మొదలైన సునీల్ సినిమా ప్రయాణంలో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉన్నాయి. విలన్ గా కూడా ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఓ వైపు కామెడీ పాత్రాల్లో నటిస్తూ హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఈ చిత్రానికి ఎం.బాలరాజు దర్శకుడు. కనబడుటలేదు చిత్రాన్ని స్పార్క్ ఓటీటీ లో విడుదల చేయనున్నారు. పలువురు ప్రముఖులు సినిమా టీజర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నగరంలో వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. మొత్తానికి కనబడుటలేదు టీజర్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Next Story