కొత్త సినిమా వివ‌రాలు వెల్ల‌డించిన సుధీర్ బాబు

Sudheer Babu turns a cop for his next. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాడు.

By Medi Samrat
Published on : 13 Feb 2022 3:51 PM IST

కొత్త సినిమా వివ‌రాలు వెల్ల‌డించిన సుధీర్ బాబు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాడు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఆయన 15వ చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెట్స్‌పై ఉంది. ఆ సినిమా రెండు నెలల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు.. అతను మరో యువ దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఆసక్తికరమైన పోస్టర్‌తో దానిపై అంచనాలను పెంచాడు.

పోస్టర్‌లో హై-ఎండ్ లేజర్, 'హాక్-ఐ' టెక్నాలజీతో రూపొందించబడిన రైఫిల్స్‌ను ప్రదర్శించారు. అవి 'స్పెషల్ క్రైమ్స్ డివిజన్'కి చెందినవి కాబట్టి.. సుధీర్‌బాబు ఈ సినిమాలో పోలీసు పాత్రలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. 'గన్స్ డోంట్ లై' అనే ట్యాగ్‌లైన్ కూడా పోస్టర్‌తో పాటుగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి మహేష్ సూరపనేని దర్శకత్వం వహించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. నటీనటుల వివరాళ‌లోకి వెళితే.. ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ప్ర‌స్తుతం సుధీర్ భాబు.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". "సమ్మోహనం" మరియు "వి" చిత్రాల తర్వాత కథానాయకుడు, దర్శకుడు కలయికలో వస్తున్న మూడవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Next Story