అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది..!
Sri Sudha Knocks Police Yet Again. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ
By Medi Samrat
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నటి శ్రీ సుధా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ కె. నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత తనను మోసం చేశాడంటూ శ్రీ సుధ గత సంవత్సరం మే 26న ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసినదే. ఈ విషయంలో తాను రాజీ పడినట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేయడం వల్ల ఇంతవరకు పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదంటూ.. ఆమె మరోసారి పోలీసులకు శ్యామ్ కె. నాయుడుపై ఫిర్యాదు చేశారు.
అయితే.. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటిలు ఈ వ్యవహారంలో కలుగజేసుకొని తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ నాపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, నన్ను బెదిరించారని తాజాగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి కొద్ది రోజుల క్రితం మాదాపూర్ లో నివాసముంటున్న చిన్నా ఇంటికి నన్ను పిలిపించి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించడమే కాకుండా శారీరకంగా నాపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్యామ్ కె. నాయుడు, అతని బంధువులు, మిత్రుల నుంచి నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయగా, వారిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాదాపూర్ లో చిన్నా నివాసం ఉండడంతో ఎస్సార్ నగర్ పోలీసులు ఈ కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు తెలియజేశారు.