గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత

Sirivennela Seetharama Sastry Hospitalised. టాలీవుడ్ సినీ గేయ‌ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు

By Medi Samrat  Published on  27 Nov 2021 4:40 PM GMT
గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత

టాలీవుడ్ సినీ గేయ‌ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. గ‌త‌ రెండు రోజులుగా శ్వాసకోశ స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయ‌న‌ను కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే అస్వస్థతకు గురైన ఆయ‌న‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఇదిలావుంటే.. సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడిన నేఫ‌థ్యంలో.. ఆ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. న్యుమోనియాతోనే ఆయ‌న‌ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు తెలిపారు. మ‌రోవైపు సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం స్పందించింది. రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.


Next Story
Share it